Jun 23,2022 21:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే తెలుగుదేశం తట్టుకోలేక పోతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. కొత్తగా పరిశ్రమలను నెలకొల్పి, ఉపాధి అవకాశాలను పెంచుతున్నామన్నారు. ఇన్ఫోసిస్‌ లాంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు.