Sep 17,2022 15:57

ప్రజాశక్తి - ముద్దనూరు (కడప) : మండలంలోని ఉప్పులూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్నకత్తెరపల్లె గ్రామంలో రెండు విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయి పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయి. ఈ విషయంపై ఈ నెల 13న ప్రజాశక్తి దినపత్రికలో '' పడుతున్న పట్టించుకోరా'' ప్రచురితమైంది. ఈ వార్తకు విద్యుత్‌ అధికారులు స్పందించారు. సర్పంచ్‌ గంగయ్య, మాజీ ఉప సర్పంచ్‌ గోపాలకృష్ణ చొరవతో ఉప విద్యుత్‌ కేంద్రం ఇంచార్జ్‌ ఎఇ శ్రీనివాసరాజ వర్మ ఆధ్వర్యంలో శనివారం పాత స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.