Sep 22,2022 21:48

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి.రామారావును ఎపి రాష్ట్ర ప్రభుత్వం అవమానించిందని మాజీ కేంద్ర మంత్రి, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. గురువారం సాయంత్రం విశాఖలోని బిజెపి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రానికి ఎంతో సేవ చేసిన ఎన్‌టిఆర్‌ పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇప్పడు అమలవుతున్న అన్ని సంక్షేమ పధకాలూ ఎన్‌టిఆర్‌ హయాంలో ప్రవేశపెట్టినవేనని అన్నారు. జగన్‌ ప్రభుత్వం.. అప్పుల ప్రభుత్వమని విమర్శించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను రాష్ట్రంలో పక్కదారి పట్టించారని తెలిపారు. ఎపిలో రోడ్ల స్థితి అధ్వానంగా ఉందన్నారు. సమావేశంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ రాజు పాల్గొన్నారు.