
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఇంటికో డాక్టర్ అంటూ సిఎం వైఎస్ జగన్ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వం 2016లో ప్రారంభించిన మొబైల్ క్లినిక్‌లకు పేరు మార్చి ఫ్యామిలీ డాక్టర్ అంటున్నారని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా ఒక్క ఆస్పత్రి నిర్మించారా? నూతన వైద్య పరికరాలు సమకూర్చారా? సిబ్బంది సంఖ్యను పెంచారా? అని నిలదీశారు. ముందు సదుపాయాలు, సిబ్బంది, ప్రమాణాలు మెరుగుపర్చండని సూచించారు. కనీసం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉత్తమ సేవలు అందించాలని డిమాండ్ చేశారు. టిడిపి హయాంలో వచ్చిన ఎటిసి టైర్ల కంపెనీని తానే తెచ్చినట్లు జగన్ సహా వైసిపి నేతలంతా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి జివి రెడ్డి ఆరోపించారు. తమ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీల గురించి జిఓలతో సహా ఉన్నాయని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మరో ప్రకటనలో తెలిపారు.