Sep 16,2022 18:16

దర్శకుడు తేజ చాలా కాలం తర్వాత తీస్తున్న కొత్త సినిమా 'అహింస'. దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా పరిచయమవుతున్నారు. పి.కిరణ్‌ నిర్మిస్తున్న చిత్రంలో గీతికా తివారీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా చిత్రంలో నటిస్తున్న పాత్రలను వీడియో ద్వారా పరిచయం చేశారు దర్శకుడు. ముఖ్య పాత్రల వాయిస్‌లను వినిపిస్తూ పోస్టర్‌లు విడుదల చేశారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్రయూనిట్‌ తెలిపింది. రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించనున్నారు.