Jan 30,2023 08:34

సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శిగా, కవిగా, కథకుడుగా సాహిత్య వికాసానికి కషి చేసిన తెలుగు ఉపాధ్యాయుడు సంకటి మహేశ్వరయ్య. ఆయన స్మారక సాహిత్య పురస్కారాన్ని ఏటా ఇవ్వాలని సాహితీ స్రవంతి జిల్లా కమిటీ నిర్ణయించిన నేపథ్యంలో- 2022 సంవత్సరానికి గానూ కథాసంపుటాలను ఆహ్వానిస్తున్నాం. కథకులు 2022లో వెలువడిన తమ కథా సంపుటాలను 3 ప్రతులు పంపాలి. ఎంపికైన కథకులకు రూ.5000 నగదు, జ్ఞాపికతో సత్కారం ఉంటుంది. కథా సంపుటాలను 2023 మార్చి 15 లోగా 'కెంగార మోహన్‌, పురస్కార కమిటీ అధ్యక్షులు, ఇ.నెం.43-238, ఫ్లాట్‌ నెం:102, ఎన్వీఆర్‌ ప్లాజా, రోడ్‌ నెం:8 ఎన్‌.ఆర్‌ పేట, కర్నూలు-518004' చిరునామాకు పంపాలి. వివరాలకు 9493375447 నెంబర్లో సంప్రదించొచ్చు. 27.04.2023న కర్నూల్లో జరిగే మహేశ్వరయ్య ద్వితీయ వర్ధంతి సభలో పురస్కార ప్రదానం ఉంటుంది.