Nov 22,2022 13:17

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో నీటిని ఎక్కువగా తాగకపోవడం వల్ల చర్మం పొడిబారుతుందని, పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు. మరి ఈ కాలంలో చర్మం పొడిబారకుండా.. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ పానీయాల్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

పాలు : నిద్రపోయే మందు పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగి పడుకుంటే నిద్ర బాగా పట్టడమే కాదు.. ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.
హెర్బల్‌ టీ : శీతాకాలంలో వేడివేడిగా హెర్చల్‌ టీ తాగితే.. రక్తపోటును తగ్గిస్తుంది. లివర్‌ ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
అల్లం టీ : ఈ టీ తాగడం వల్ల కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అజీర్ణం వంటి సమస్యల్ని నివారిస్తుంది. అయితే మీరు ఈకాలంలో ఏ టీ తాగినా.. రెండు కప్పులకు మించి తాగకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏ పానీయాలు అయినా నీటికి సాటి కాదని వైద్యులు అంటున్నారు. రోజువారీ దినచర్యలో కానీ, ప్రయాణాల్లో కానీ నీటిని ఎక్కువ తీసుకోకపోయినా, కొద్దిగా కొద్దిగా తీసుకున్నా హైడ్రేషన్‌కి లోనుకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.