Nov 24,2022 17:55

అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. శుక్రవారంథియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేసింది. అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ.. ఏఆర్‌ మోహన్‌ బేసిక్‌ లైన్‌ను వివరించిన తర్వాత దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్‌గా రాసేందుకు సమాచారం సేకరించడం మొదలుపెట్టామన్నారు. డాటా సేకరించే క్రమంలో గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలేంటో తెలుసుకున్నామన్నారు. వారి హక్కులు, అర్హతల కోసం అంశాలు ఉండేలా సినిమా తీశామన్నారు. చివరి 20 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్‌ పోర్షన్‌ చాలా కీలకంగా ఉంటుందన్నారు. ఫైట్‌ మాస్టర్‌ పృథ్వి ఆకట్టుకునే విధంగా క్లైమాక్స్‌ను కంపోజ్‌ చేశారని, అది హైలెట్‌గా నిలుస్తుందన్నారు. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్‌, జీ స్టూడియోస్‌ పతాకాలపై రాజేష్‌ దండా నిర్మించారు. వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, సంపత్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు.