Nov 24,2022 15:34

విజయవాడ: జగనన్న నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు పేరుతో వైసిపి నేతలు పేదల భూములు కాజేయలని చూసినా 10 వేల ఎకరాలను కాపాడామని జై భీం భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'మీ భూమి మా హామీ' పేరుతో జగనన్న భు హక్కు, భు రక్షను తెచ్చారని.. వైఎస్సార్‌ శాశ్వత భు హక్కు- భు రక్ష పథకం పేరు భు రక్ష కాదు.. భు భక్ష పథకం అని అన్నారు. కోనేరు రంగారావు సిఫార్సులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సర్వేకు ఎవరైనా అంగీకరించినట్టయితే ఆ భూమి వారికి కాకుండా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పేదల దగ్గర భూములు లాక్కొని వైసిపి చోటా మోటా నాయకులకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్‌లు జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయన్నారు. వార్డు సెక్రటరీ చేసిన రిజిష్టర్‌ డాక్యుమెంట్‌ కోర్టు ముందు నిలబడదని, ఎవరూ వార్డు సెక్రటరీల వద్ద రిజిస్ట్రేషన్‌లు చేయించుకోవద్దని జడ శ్రవణ్‌ కుమార్‌ సూచించారు.