Aug 11,2022 07:12

జమ్ముకాశ్మీర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని బుద్గామ్‌ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. బుద్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య బుధవారం ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున బుద్గామ్‌లో భద్రతా దళాలు లష్కరే తొయిబా ఉగ్రవాదులను ట్రాప్‌ చేసి వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాది లతీఫ్‌తో సహా ఎల్‌ఇటికి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ప్రభుత్వ ఉద్యోగి రాహుల్‌ భట్‌, టివి నటి అమ్రీన్‌ భట్‌లతో సహా పలు పౌర హత్యల్లో ఉగ్రవాది లతీఫ్‌ ప్రమేయం ఉందని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు.