Nov 25,2022 12:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రానున్న సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం నుంచి శుక్రవారం (నవంబర్‌ 25) రోజున చిత్రయూనిట్‌ 'జై బాలయ్య' సాంగ్‌ని విడుదల చేసింది. 'రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు.. నిన్ను తలచుకున్నవారు లేచి నుంచుని మొక్కుతారు' అని మొదలయ్యే ఈ సాంగ్‌ని బాలయ్య ఫ్యాన్స్‌ వింటే ఫుల్‌ ఖుషీ అవుతారు. ఓరకంగా చెప్పాలంటే పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి బాలయ్య ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకునే పదాలు రాశారని స్పష్టంగా తెలుస్తోంది. ఇక పాటకు తగ్గట్టుగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌ థమన్‌ ఊపునిచ్చేలా బాణీలు సమకూర్చారు. ఈ పాటకు సంబంధించిన వీడియోలో థమన్‌ డ్యాన్స్‌ చేయడం, గోపిచంద్‌ సాంగ్‌ చిత్రీకరణను పర్యవేక్షించడం కూడా కనిపిస్తుంది. ఈ పాటను గాయకుడు కరిముల్లా ఆలపించారు. ఈ చిత్రాన్ని నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై సంయుక్తం నిర్మిస్తున్నారు.