
అమరావతి : ఆంధ్రప్రదేశ్ సిఎస్‌గా డా.కె.ఎస్. జవహర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఎఎస్ ఆఫీసర్ అయిన జవహర్ ప్రస్తుతం సిఎంకి ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సిఎస్‌గా జవహర్ డిసెంబర్ 1 నుండి బాధ్యతలు చేపట్టనున్నారు.