Nov 29,2022 22:20

సిఎం సిఇఓగా సమీర్‌శర్మ
సిఎంఓకు పూనం మాలకొండయ్య
విద్యాశాఖకు ప్రవీణ్‌ప్రకాష్‌

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం నాటితో ప్రస్తుత సిఎస్‌ సమీర్‌శర్మ పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1990వ బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి అయిన జవహర్‌రెడ్డి ఇప్పటివరకు ప్రభుత్వంలో అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం సిఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్నారు. అంతకు ముందు టిటిడి ఇఓగా బాధ్యతలు నిర్వహించారు. సమీర్‌శర్మ పదవీ విరమణ చేసిన వెంటనే జవహర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమణ అనంతరం సమీర్‌శర్మను సిఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఓ)గా నియమించారు. ఇప్పటివరకు ఈ పోస్టు లేదు. ప్రస్తుతం కొత్తగా సృష్టించారు. సిఎంకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరో సీనియర్‌ అధికారి పూనం మాలకొండయ్యను నియమించారు. వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనరెడ్డి, కమిషనర్‌గా రాహుల్‌పాండేను నియమించారు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రవీణ్‌ప్రకాష్‌, రోడ్లు భవనాలశాఖ ముఖ్యకార్యదర్శిగా పి.ఎస్‌.ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుడితి రాజశేఖర్‌ను జిఎడిలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ కూడా బుధవారమే రిటైర్‌ అవుతున్నారు. ఆయన్ను ప్లానింగ్‌ సొసైటీ సిఇఓగా నియమించనున్నట్లు తెలిసింది. త