Nov 25,2022 14:08

అమరావతి : ప్రస్తుత సిఎస్‌ సమీర్‌ శర్మ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో... ఎపి కొత్త సిఎస్‌గా జవహర్‌ రెడ్డి నియామకమవుతారనే ప్రచారం ఊపందుకుంది. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి జవహర్‌ రెడ్డి వైపే రాష్ట్ర ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.