
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్థి కార్యక్రమాలన్నీ వందశాతం అమలు చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం మొదటిబ్లాక్‌లో సిఎస్ ఛాంబర్లో ఉద్యోగ విరమణ చేసిన సమీర్ శర్మ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ . ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో చివరి వ్యక్తికి చేరేలా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం రెండింటినీ సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు శాయశక్తుల కృషిచేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి సాయిప్రసాద్, కె ప్రవీణ్‌కుమార్, కరికాల వలవన్, బి.రాజశేఖర్, ఎస్ఎస్.రావత్, ముఖ్యకార్యదర్శులు ఎమ్‌టి కృష్ణబాబు, ముత్యాలరాజు, సిఇఓ ముఖేష్‌కుమార్ మీనా పాల్గన్నారు. నూతన సిఎస్‌కు అభినందనలు తెలిపారు.