Aug 18,2022 20:32

మంచు విష్ణు హీరోగా, సూర్య దర్శకత్వంలో వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జిన్నా'. ఇది విష్ణుకు మొదటి పాన్‌ ఇండియా చిత్రం. అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర టీజర్‌ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్‌ను తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎవిఎ ఎంటర్‌టైన్మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.