Oct 05,2022 19:30

మంచు విష్ణు హీరోగా తెరెకెక్కుతున్న తాజా చిత్రం 'జిన్నా'. ఈ సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. దసరా కానుకగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇషాన్‌ సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో మంచు విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నారు. కామెడీ, హారర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.