
ప్రజాశక్తి - తిరుమల : తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లను టిటిడి బుధవారం విడుదల చేసింది. జులై, ఆగస్టు నెల 300రూ.దర్శనం టికెట్లు ఉదయం పది గంటలకు విడుదల చేయడంతో అప్పటికే వేచి ఉన్న సందర్శకులు రెండు నెలల టికెట్లను ముడుగంటల్లో కొనుగోలు చేశారు.
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం స్వామివారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.