
- నోటిఫై చేసిన కేంద్రం
- 32కు చేరిన జడ్జీల సంఖ్య
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా ఇద్దరు జ్యుడీషియల్ అధికారుల నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. జ్యుడీషియల్ అధికారులు పి వెంకట జ్యోతిర్మయి, వి గోపాలకృష్ణా రావును ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. జనవరి 10న సుప్రీంకోర్టు కొలీజియం వీరిని నియమించాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తుల నియామకానికి అవకాశం ఉండగా, తాజా నియామకాలతో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.