Sep 29,2022 15:14

హైదరాబాద్‌ : జాతీయ పార్టీ ప్రకటించే ముందు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం 11 గంటలకు యాదాద్రికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. అనంతరం సిద్దిపేట జిల్లా కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్‌ దర్శించుకోనున్నారు. అక్కడ కూడా ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జాతీయ పార్టీపై కార్యవర్గం తీర్మానం చేయనుంది. కేసీఆర్‌ మొత్తం నాలుగు పేర్లను పరిశీలిస్తున్నారు. వీటిలో భారతీయ రాష్ట్ర సమితి పేరుకే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.