Aug 18,2022 12:39

హరారే : టీమిండియాతో తొలి వన్డేలో జింబాబ్వే వికెట్లు కోల్పోతుంది. ఒక్క పరుగు మాత్రమే చేసిన సీన్‌ విలియమ్స్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. వెస్లీ మదెవెర్‌ దీపక్‌ చహర్‌ బౌలింగ్‌లో ఎల్బీగా ఔటయ్యాడు. అంతకముందు దీపక్‌ చాహర్‌ 28 పరుగుల వద్ద దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో కైయా,మరో ఓపినర్‌ మరుమని సంజు శ్యాంసన్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరారు.

రెండు వికెట్లు డౌన్‌.. జింబాబ్వేతో 28/2

out

 జింబాబ్వే రాజధాని హరారేలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో భారత్‌, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో జింబాబ్వే 8 ఓవర్లకు రెండు వికెట్టు కోల్పొయి 28 పరుగులు చేసింది. ఈ రెండు వికెట్లను దీపక్‌ చాహర్‌ దక్కించుకున్నాడు. తొలుత కైయా కిపర్‌ సంజు చేతికి చిక్కగా మరో ఓపినర్‌ మరుమని కూడా సంజుకే క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో సీన్‌ విలియమ్స్‌, వెస్లీ మదెవెర్‌ ఉన్నారు.

టాస్‌ గెలిచిన కెఎల్‌ రాహుల్‌.. జింబాబ్వేతో తొలి వన్డే

toss

జింబాబ్వే రాజధాని హరారేలోని క్రికెట్‌ గ్రౌండ్‌లో భారత్‌, జింబాబ్వే జట్ల మధ్య మరికాసేపట్లో మొదటి వన్డే ప్రారంభంకానుంది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ జింబాబ్వేను బ్యాటింగ్‌కు ఆహ్వనించాడు. జట్టులోని సీనియర్లకు రెస్ట్‌ ఇవ్వడంతో యువ క్రికెటర్లకు అవకాశం దక్కిన విషయం తెలిసిందే..

భారత్‌ జట్టు : శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), దీపక్‌ హుడా, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, దీపక్‌ చాహర్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ సిరాజ్‌

జింబాబ్వే: తడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కైయా, సీన్ విలియమ్స్, వెస్లీ మాధేవెరే, సికందర్ రజా, రెగిస్ చకబ్వా(కెప్టెన్‌), ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, విక్టర్ న్యౌచి, రిచర్డ్ నగరవ