
కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన మల్టీస్టారర్ మూవీ 'కబ్జ'. ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కింది. ఈ నేపథ్యంలో సినిమా మార్చి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది. పోస్టర్లో ఉపేంద్ర విలన్ను చావగొట్టి బైక్పై పడుకోబెట్టి తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా కథ 1947 నుండి 1984 మధ్య జరుగుతుందని సమాచారం. శ్రియాశరణ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇలా ఏడు భాషల్లో విడుదలవుతున్న మొదటి కన్నడ సినిమాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది.