Nov 25,2022 15:29

హైదరాబాద్‌: స్టార్‌ నటుడు కమల్‌హాసన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ సెంటర్‌లో చేర్పించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. ఈ నేపథ్యంలో కమల్‌ హాసన్‌ ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. అయితే కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం కమల్‌హాసన్‌ 'ఇండియన్‌-2' షూటింగ్‌తో పాటు తమిళ 'బిగ్‌బాస్‌' కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు.