
ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో ఉండే కమల్ హాసన్ బుధవారం నాడు కళాతపస్వి కె విశ్వనాథ్‌ను హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిశారు. విశ్వనాథ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో కలిసి గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ, వ్యక్తిగత విషయాలను ముచ్చటించుకున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ వీల్‌ఛైర్‌లో ఉన్న విశ్వనాథ్ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో మరుపురాని ఆణిముత్యాల జాబితా టాప్‌లో ఉంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్ సినిమా రావాలని.. అందుకు ఇద్దరూ సహకరించాలంటూ..ఫొటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కమల్‌హాసన్ ప్రస్తుతం'ఇండియన్-2'లో నటిస్తున్నారు.