Nov 24,2022 17:22

ఇంటర్నెట్‌డెస్క్‌ : కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌శెట్టి తెరకెక్కించిన చిత్రం 'కాంతార'. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌హిట్‌కొట్టింది. రూ. 16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లని రాబట్టింది. చిత్రం విడుదలై 50 రోజులు అవుతున్నా ఇంకా థియేటర్‌లో సందడి చేస్తోంది. అయితే నెటిజన్లను అలరించడానికి నవంబర్‌ 24న శనివారం ఓటీటీలో అమెజాన్‌ వేదికగా విడుదలైంది. ఓటీటీలోని ఈ మూవీని చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఈ సినిమాలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన 'వరాహ రూపం' సాంగ్‌కు వేరే సాంగ్‌ రీప్లేస్‌ అయింది. వరాహరూపం పాటే సినిమాకే ప్లస్‌పాయింట్‌. అలాంటి ఈ పాటే తాజాగా ఓటీటీలో విడుదలైన 'కాంతార' సినిమాలో లేదు. ముందుగా థియేటర్‌లో విడుదలైన చిత్రంలోని సాంగ్‌కి, ఇప్పుడు ఓటీటీలో విడుదలైన పాటకి తేడా ఉంది. దీంతో ప్రేక్షకులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కాంతార సినిమా ఫీల్‌ పోయింందని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలు పాట రీప్లేస్‌ చేయడానికి గల కారణమేమిటంటే.. కాంతార సినిమాలో వాడిన వరాహ రూపం సాంగ్‌.. ఐదేళ్ల క్రితమే ఒరిజనల్‌ బీట్‌ ఉందని కాపీ రైట్‌ సమస్యలు తలెత్తి, వివాదం కోర్టు వరకూ వెళ్లింది. దీంతో మేకర్స్‌ ఈ సాంగ్‌ని సినిమా నుంచి తొలగించారు. ఓటీటీలో సినిమా చూసిన నెటిజన్లు మాత్రం కాపీ రైట్‌ ఇష్యూ చేసేవాళ్లతో ఏదో రకంగా సెటిల్మెంట్‌ చేసుకుని ఆ సాంగ్‌నే సినిమాలో ఉంచమని పోస్టులు పెడుతున్నారు. మరి ఈ చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిల్మ్‌ ప్రొడక్షన్స్‌ 'వరాహ' సాంగ్‌పై పునరాలోచిస్తుందో లేదో చూడాలి మరి.