
హైదరాబాద్ : ప్రముఖ విత్తనాల కంపెనీ కావేరీ సీడ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 313.24 శాతం వృద్థితో రూ.37.54 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.9.08 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.102 కోట్లుగా ఉన్న కంపెనీ రెవెన్యూ.. క్రితం క్యూ3లో 20.97 శాతం పెరిగి రూ.123.49 కోట్లకు చేరాయి. కాటన్ రెవెన్యూలో 6.20 శాతం, హైబ్రిడ్ రైత్ రెవెన్యూలో 117 శాతం చొప్పున వృద్థి చోటు చేసుకుందని ఆ కంపెనీ తెలిపింది. గడిచిన క్యూ3లో, తొమ్మిది మాసాల కాలంలోనూ మెరుగైన ఆర్థిక ఫలితాలు సాధించామని కావేరీ సీడ్స్ సిఎండి జివి భాస్కర్ రావు తెలిపారు.