Jun 20,2022 12:38

న్యూఢిల్లీ : కొడవలిలో దాడి చేయబోయిన వ్యక్తిని ఎంతో ధైర్యంగా పోలీసు అధికారి ఎదుర్కొన్న ఘటన కేరళలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాయంకుళం సమీపంలోని పారా జంక్షన్‌ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బండిపై వెళుతుండగా.. పోలీసు వాహనం అతని పక్కగా రావడాన్ని గమనించిన.. సదరు వ్యక్తి.. ఆగి.. ఒక్కసారిగా కొడవలి తీసి.. వాహనం దిగుతున్న పోలీసుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. తక్షణమే అప్రమత్తమైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అతడిని ఎంతో ధైర్యంగా అడ్డుకున్నారు. అతడ్ని కిందపడేసి ఆయుధాన్ని తీసుకున్నారు. ఈ వీడియోను ఐపిఎస్‌ అధికారి స్వాతి లక్రా ట్విట్టర్‌లో షేర్‌ చేసుకున్నారు. 'రియల్‌ హీరోలా కనిపిస్తున్నాడని, కేరళకు చెందిన ఈ పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌కు సెల్యూట్‌' అంటూ వ్యాఖ్యాలు జత చేశారు. ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆ అధికారి ధైర్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

 <