Aug 07,2022 12:53

ఆసియా కప్‌ లాంటి మెగా టోర్నీకి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్‌ పేసర్‌ హర్షల్‌ పటేల్‌ జట్టుకు దూరమయ్యాడు. గత ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో 32 వికెట్లు తీసి అందరి దష్టిని ఆకర్షించిన హర్షల్‌.. టీ20 స్పెషలిస్ట్‌గా భారత జట్టులోకి వచ్చాడు. డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆసియాకప్‌, టీ20 ప్రపంచకప్‌ ప్రణాళికల్లో హర్షల్‌ పటేల్‌ను అందరూ కీలకంగా భావించారు. అయితే ఇటీవల పక్కటెముకల గాయంతో వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికైనా టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకోవాలంటే హర్షల్‌ పటేల్‌ మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు సమాచారం అందుతోంది. ఈ వార్త నిజమైతే హర్షల్‌ పటేల్‌ ఆసియా కప్‌కు మాత్రమే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచి దుబారులో ఆసియా కప్‌ జరగనుండగా అక్టోబర్‌ తొలివారంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం అవుతుంది. హర్షల్‌ పటేల్‌ జట్టుకు దూరం కావడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెస్టిండీస్‌ పర్యటన నుంచి అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారులు వెల్లడించారు.