
హీరోయిన్ సమంత, రౌడీబారు విజరు దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతోన్న తాజా చిత్రం 'ఖుషీ'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. షూటింగ్ మధ్యలో సమంత, విజరులు బయటకు వచ్చి టర్కీ వాతావరణాన్ని ఎంజారు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. ఓ కొత్త తరహా ప్రేమ కథతో వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రోమ్-కామ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుంది. మేకర్స్ పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.