Mar 18,2023 13:20

ప్రసాదంపాడు (విజయవాడ) : మహిళా కార్మికులు, హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ... శనివారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో తణుకు వై.జంక్షన్‌ వద్ద ఉన్న ఎపి సీడ్స్‌ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్ల పై నిలబడి ధర్నా నిర్వహించారు. ఎపి సీడ్స్‌ అధికారుల మొండి వైఖరి నశించాలని నినదించారు. పాత పద్ధతిని కొనసాగించాలని కోరారు. టెండర్‌ విధానం రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌ మాట్లాడుతూ..... ఎపిఎస్‌ఎస్‌డిసి సంస్థలో హమాలీలుగా తామంతా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని, హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రామిక మహిళ కన్వీనర్‌ అడ్డగర్ల అజయకుమారి, సుమారు 10 మంది హమాలీ, మహిళా కార్మికులు పాల్గొన్నారు.