Jun 23,2022 13:53

నాగచైతన్య-కృతిశెట్టి జోడి మరోసారి సందడి చేయనుంది. నాగార్జున ప్రధాన పాత్రలో కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బంగార్రాజు చిత్రంలో వీరిద్దరూ ఆడిపాడిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య 22వ చిత్రంలో కృతి ఖరారయ్యారు. తెలుగు, తమిళంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ జూన్‌ 22న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం ద్వారా నాగచైతన్య తమిళ ఇండ్రస్టీకి పరిచయం కాబోతున్నారు. యూటర్న్‌, ది వారియర్‌ వంటి చిత్రాలను నిర్మించిన శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ సినిమాకు ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్‌ శంకర్‌ రాజా బాణీలు సమకూర్చుతున్నారని సమాచారం.