Jun 24,2022 11:46

నిడదవోలు (పశ్చిమ గోదావరి) : లారీ, కారు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం నాగపూర్‌ హైవే పై చోటుచేసుకుంది. ఉమ్మడి ప.గో.జిల్లా నిడదవోలుకు చెందిన కుటుంబం కాశీ నుండి తిరుగు ప్రయాణమయ్యింది. నాగపూర్‌ హైవే పై ఈరోజు తెల్లవారుజామున వెళుతుండగా... లారీ ఢీకొనడంతో కారులో ఉన్న శ్రీనివాసరావు మృతి చెందారు. కారులో ఎనిమిదిమంది ఉన్నారు. మిగిలినవారికి గాయాలయ్యాయి. గాయాలయినవారిలో నలుగురు మహిళలు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులకు నాగపూర్‌ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జిల్లా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.