Sep 29,2022 15:25

పూణే: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల గజల్‌ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కార్‌ గౌరవం దక్కింది.పుణే నగరంలో శ్రీ యశ్వంత్‌ రావు చవాన్‌ ఆడిటోరియంలో వేలాది మంది సమక్షంలో గజల్‌ శ్రీనివాస్‌కు విశ్వ విఖ్యాత మరాఠీ కళాకారుడు ప్రశాంత్‌ దామ్లే ఈ అవార్డ్‌ను అందజేశారు. ఈ కార్యక్రమానికి సునీల్‌ దేవదర్‌ అధ్యక్షత వహించారు. 'భారతరత్న' పురస్కార గ్రహీత లతా మంగేష్కర్‌ జన్మ దినోత్సవం సందర్భంగా మై హౌమ్‌ ఇండియా మహారాష్ట్ర , ముమ్మారు ఆధ్వర్యంలో సంగీత సామ్రాజ్ఞి లతా మంగేష్కర్‌ స్మృతి పురస్కారం జ్ఞాపికతో పాటు రూ.21,000 వేల పురస్కార పారితోషికాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో డా.గజల్‌ శ్రీనివాస్‌.. లతా మంగేష్కర్‌పై రాజేంద్ర నాథ్‌ రెహబర్‌ , కల్నల్‌ తిలక్‌ రాజ్‌ , రవికాంత్‌ అన్మోల్‌ రచించిన హిందీ, ఉర్దూ గజల్స్‌ను గానం చేసి ఆమెకు గాన నీరాజనం అందజేశారు.