Jan 30,2023 10:21

నవ్వాలి నవ్వాలి
తనివితీర నవ్వాలి
నదినీరు పరవళ్ళు
తొక్కినట్టు నవ్వాలి

పైరుగాలికీ ఊగే
పంటలాగ నవ్వాలి
పొయ్యిమీద పాలకడవ
పొంగినట్టు నవ్వాలి

పూలతీగమీద ఉన్న
పిట్టలాగ నవ్వాలి
పొట్ట చెక్కలయ్యేలా
పకపకా నవ్వాలి
బిడ్డతో ఆడుతున్న
తల్లిలాగ నవ్వాలి
తనువంతా నిండుగా
తన్మయంతో నవ్వాలి

నెమలి పురివిప్పినట్టు
వికసిస్తూ నవ్వాలి
సిరిమల్లె తీగకున్న
పువ్వల్లే నవ్వాలి

- రావిపల్లి వాసుదేవరావు
94417 13136