Jan 31,2023 21:14

న్యూఢిల్లీ : టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టికెఎం) తాజాగా తమ నూతన ఇన్నోవా క్రిస్టా కోసం బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు మంగళవారం ప్రకటించింది. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా ఆధునీకరించబడిన ఫ్రంట్‌ ఫాసియాతో వస్తుందని పేర్కొంది. ఇది భారతీయ కుటుంబాలు, వ్యాపారవేత్తలు, కార్పోరేట్స్‌, ఫ్లీట్‌ యజమానుల అవసరాలను తీర్చనుందని తెలిపింది. తమ డీలర్‌ లేదా అవుట్‌లెట్‌, ఆన్‌లైన్‌లో రూ.50వేలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నూతన ఇన్నోవా క్రిస్టా నాలుగు గ్రేడ్లలో ఐదు రంగులో అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొంది.