Sep 17,2023 12:36

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హిరోగా నటించిన చిత్రం 'గేమ్‌ చేంజర్‌'. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని ఓ పాట సామాజిక మాధ్యమాల్లో లీకైన ఓ సాంగ్‌ సంచలనం సృష్టించింది. దీంతో ఈ సినిమా నిర్మాతలు న్యాయపరమైన చర్యలకు దిగారు. ''మా సినిమా గేమ్‌ చేంజర్‌లోని కంటెంట్‌ను లీక్‌ చేసిన వారిపై ఐపీసీ 66 (సీ) సెక్షన్‌ కింద క్రిమినల్‌ కేసు దాఖలు చేయడం జరిగింది. చట్టవిరుద్ధంగా లీకైన నాణ్యతలేని కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి దూరంగా ఉండాలని కోరుతున్నాం''అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.