Jun 24,2022 07:16

కొల్‌కతా : కేంద్ర ప్రభుత్వం సైనాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకొచ్చిన కాంట్రాక్టు పథకం 'అగ్నిపథ్‌'ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రమంతటా వామపక్షాలు గురువారం నాడు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. అగ్నిపథ్‌తో పాటు ధరల పెరుగుదల, నిరుద్యోగం, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీలు చేపట్టారు. పశ్చిమ మిడ్నాపుర్‌లో జరిగిన ఆందోళనలకు సిపిఎం సీనియర్‌ నాయకులు సుశాంత ఘోష్‌, తపస్‌ సిన్హా నేతృత్వం వహించారు. మాల్దా జిల్లాలో జరిగిన వామపక్షాల ర్యాలీల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి అంబర్‌ మిత్రా తదితరులు పాల్గొన్నారు.