Nov 25,2022 08:36

అక్షరాలతో చెలిమే చేద్దాం
వాక్యాలతో చేయి కలుపుదాం
పుస్తకాలతో పలకరించుదాం
ప్రపంచ జ్ఞానం తెలుసుకుందాం

పాఠ్యాంశాలు చక్కగ చదివి
ప్రశ్నకు జవాబు చెప్పేద్దాం
పరీక్షలో గెలుపు సాధిద్దాం
అందరి మెప్పును పొందేద్దాం

పుస్తకాలను ప్రేమిద్దాం
లోకజ్ఞానం కలిగి వుందాం
విజ్ఞానాన్ని పెంచుకుందాం
విజ్ఞతతో కలిసి జీవిద్దాం

గ్రంథాలయానికి రోజూ వెళ్దాం
వార్తా కధనాలు చదివొద్దాం
కథల పుస్తకాలు తిరగేద్దాం
మెదడుకు పదును పెట్టేద్దాం

గురువు మాటను ఆలకిద్దాం
చెప్పే పాఠాలు శ్రద్ధగా విందాం
భావం చక్కగా జ్ఞాపకం ఉంచుదాం
పదుగురికి సూచనలు ఇచ్చేద్దాం

చదువులో మేటిగా రానిద్దాం
ఒడిలో పుస్తకాన్ని ఇమిడిద్దాం
పేరాలన్నీ గమనించుదాం
సందర్భాన్ని ఆస్వాదించుదాం

పుస్తకాలే గురువుగా పూజిద్దాం
అందులో మనం మునకలేసేద్దాం
ఎన్నో సంగతులు తెలుసుకుందాం
భావితరాలకు అందిద్దాం

- నరెద్దుల రాజారెడ్డి
96660 16636