Oct 01,2022 10:43

పిల్లలందరం కలిసి
కమ్మని పాట పాడుదాం
చక్కటి ఆటలు ఆడి
పాటకు రూపం తీసుకొద్దాం

ఈల పాటకు ఉత్సాహంగా
గాల్లో తేలిపోదాం
జోల పాటకు హాయిగా
తెల్లవార్లూ బజ్జుందాం

జానపదానికి ఎంచక్కా
గజ్జెలు కట్టుకొని ఆడుదాం
చందమామ రావే అంటూ
గోరుముద్దలు తిందాం

కోకిల పాటకు ఉల్లాసంగా
గొంతును కలిపి పాడుదాం
చిలక పలుకులకు తీయగా
పల్లవి జత కడుదాం

చల్లని గాలికి ఆహ్లాదంగా
చక్కని రాగం తీద్దాం
చలికి వణుకుతూ చక్కగా
సరిగమలను పలుకుదాం

కొక్కొరోకో అంటూ ముందుగా
వేకువ పాటను పాడుదాం
పాఠశాలలో వరుస క్రమంగా
జాతీయగీతం ఆలపిద్దాం

పాటలతో మనసుకు హాయిగా
ఆనందాన్ని పంచుదాం
అలసట మొత్తం తీరేలాగా
పాటలు చిక్కగా పాడుకుందాం

- నరెద్దుల రాజారెడ్డి
96660 16636