Aug 06,2022 12:38

ప్రజాశక్తి - భైరవాన (అనంతపురం) : భైరవాన తిప్ప డ్యాం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో వేదావతి హగరి ఉధృతంగా ప్రవహిస్తుందని రాయదుర్గం అర్బన్‌ సిఐ శ్రీనివాసులు తెలిపారు. గుమ్మగట్ట మండలం భూప సముద్రం సమీపాన వేదవతి నది వద్ద వరద ఉధతిని పరిశీలించారు. రాకపోకలు సాగించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.