
ప్రజాశక్తి-శ్రీశైలం ప్రాజెక్టు :శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఐదు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 1,39,915 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ జూరాల నుంచి 74,015, సుంకేసుల నుంచి 78,584 క్యూసెక్కులు కలిపి 1,52,589 క్యూసెక్కుల నీరు శ్రీశైలంకు వచ్చి చేరుతున్నాయి. తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గడిచిన 24 గంటల్లో 17.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,784, కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 17.11 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 31,112 క్యూసెక్కుల నీటిని దిగువకు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ అనంతరం, శ్రీశైలం గేట్ల ద్వారా మొత్తం 1,92,901 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా పోతిరెడ్డిపాడుకు 21,750, హంద్రీ-నీవా సుజల స్రవంతికి 1561 నీటిని విడిచిపెడుతున్నారు.