May 31,2023 19:38

దర్శకుడు తేజ, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు కుమారుడు అభిరామ్‌తో 'అహింస' సినిమా తీశారు. జూన్‌ 2న విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో అభిరామ్‌ మీడియాతో కొన్ని షేర్‌ చేసుకున్నారు. షూటింగ్‌లో భాగంగా అభిరామ్‌ ఓ చేతిలో గన్‌, మరోచేతి భుజంపై హీరోయిన్‌ను వేసుకుని పరుగెత్తినప్పుడు కిందపడటంతో గాయపడ్డాడు. దాంతో యూనిట్‌ అంతా 4 నెలల విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే అభిరామ్‌ మాత్రం ఎలాగైనా ఆ షాట్‌ను పర్‌ఫెక్ట్‌గా పూర్తి చేయాలన్న పట్టుదలతో కొన్ని వారాలపాటు తన భుజంపై 50 కిలోల బరువుతో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ ప్రాక్టీస్‌ సెషన్‌ను ప్రతీ రోజూ వీడియో తీసి తేజకు పంపాడు. అభిరామ్‌ ఫైనల్‌గా తేజ అనుకున్నట్టుగా ఆ షాట్‌ను హీరోయిన్‌తో ముగించాడు. చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై పీ కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా నటిస్తోంది. సముద్రఖని విలన్‌గా నటిస్తున్నాడు.