Oct 05,2022 20:20
  •  ప్రియుడు మతి, ప్రియురాలి పరిస్థితి విషమం

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈఘటనలో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు జిల్లా సింగరాయకొండకు చెందిన వేణు, ప్రకాశం జిల్లా దర్శికి చెందిన విష్ణు ప్రియ గత కొద్ది రోజులుగా సహా జీవనం సాగిస్తున్నారు. గత నెల రోజుల క్రితం దర్శిలో విష్ణు ప్రియ అదశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కారులో మంత్రాలయం చేరుకున్న వేణు, విష్ణు ప్రియ శ్రీ సుయతీంద్ర వసతి గృహం సమీపంలో కారును నిలిపి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య యత్నం చేశారు. ఈ క్రమంలో కారులో ఉన్న వీరిని శ్రీ మఠం సెక్యూరిటీ సిబ్బంది గమనించి సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకునే పరిశీలించామని తెలిపారు. అప్పటికే వేణు మృతి చెందగా విష్ణు ప్రియ కొన ఊపిరితో ఉండటంతో ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. సెల్‌ ఫోన్‌ ఆధారంగా విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు వస్తే తప్పా పూర్తి సమాచారం తెలియదని ఎస్‌ఐ వేణు గోపాల్‌ రాజ్‌ వివరించారు.