Nov 24,2022 18:48

'మీ జీవితం ఓ ఉత్సవం... మీ నిష్క్రమణం కూడా అంతకుమించిన వేడుకే. అదీ మీ ఔన్నత్యం. నిర్భయంగా జీవించారు మీరు, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ మీ తత్వంగా బతికారు. మీరు చప్పున దూరం కావడంతో - నా స్ఫూర్తి... నా ధైర్యం ఇంకా ఏ ఉన్నత విలువలు నాకు అత్యంత ముఖ్యమనుకున్నానో... అవన్నీ క్షణంలో మాయమైపోయాయి. కానీ చిత్రంగా, అంతకు ముందెన్నడూ లేని బలం ఇప్పుడు నాకు అనుభవంలోకి వచ్చింది. నేనిప్పుడు నిర్భయుడ్ని.... మీ జ్యోతి వెలిగిస్తుంది నన్ను ఎప్పటికీ. మీ వారసత్వాన్ని మున్ముందుకు తీసికెళ్తాను. మీరు మరింత గర్వపడేలా చేస్తాను. లవ్‌ యూ నాన్న, మీరే నా సూపర్‌ స్టార్‌' అని మహేశ్‌ బాబు ట్విట్టర్‌లో పోస్ట్‌ పెట్టారు. ఇటీవలె గుండెపోటుతో కృష్ణ మరణించారు. మహేష్‌ పెట్టిన ఈ భావోద్వేగ పోస్టు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.