
బ్రసీలియా : ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించమని బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్లా స్పష్టం చేశారు. సోమవారం బ్రసీలియాలోని ప్లానాల్టో ప్యాలెస్‌లో జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో సమావేశం అనంతరం మీడియా సమావేశంలో లూలా ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధానికి తాము ఆయుధాలను అందించేందుకు బ్రెజిల్ సిద్ధంగా లేదని అన్నారు. బ్రెజిల్ శాంతిని ఆకాక్షించే దేశ మని, ఈ సమయంలో శాంతిని కోరుకునే దేశాలను మనతో కలుపుకోవాలని అన్నారు. శాంతి అనే పదాన్ని ప్రస్తుతం చాలా తక్కువగా వినియోగిస్తున్నారని లూలా తన అధికారిక ట్విటర్‌లో తెలిపారు. చైనా, భారత్, ఇండోనేషియా వంటి దేశాలతో కలిసి భూమిపై శాంతిని నెలకొల్పాలని కోరుకునే దేశాల క్లబ్‌ను నెలకొల్పేందుకు, సహకారం అందించేందకు బ్రెజిల్ సిద్ధంగా ఉందని అన్నారు. ప్రస్తుత యుద్ధంలో చైనా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని లూలా అన్నారు. మార్చిలో చైనా పర్యటన సమయంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి గురించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చర్చించాలనుకుంటున్నానని అన్నారు.