Oct 05,2022 15:14

ప్రజాశక్తి అమరావతి (గుంటూరు) : అమరావతి మండలకేంద్రం దిడుగులో పెదకూరపాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ. 40 లక్షల విలువైన ప్రొక్లెయినర్‌, రూ.30 లక్షలు విలువైన జేసీబీ, రూ.28 లక్షల విలువైన పవర్‌ రోడ్‌ రోలర్‌ను పెదకూరపాడు నియోజకవర్గానికి అంకితం చేశారు. తొలి ప్రయత్నంగా దిడుగు గ్రామంలోని వ్యవసాయ భూమికి రహదారి కోసం గ్రావెల్‌ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్న సమయంలో చాలామంది రైతులు పొలాలకు వెళ్లేందుకు రహదారులు బాగోలేవని.. వర్షాల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలపడంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నంబూరు బాబురావు, కంచేటి సాయి, జాలయ్య, హనుమంతరావు, సాంబిరెడ్డి, మీరయ్య, వెంకటేశ్వర రెడ్డి, ఈదా సాంబిరెడ్డి, నాయుడు రాంబాబు, గ్రామ నాయకులు బ్రహ్మానందరెడ్డి, తేళ్ల రోశయ్య, విజ్ఞేశ్వర రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, కొండవీటి కోటేశ్వరరావు, బాచిన శ్రీనివాసరావు ధరణికోట సర్పంచి మాదాసు పావని రాంబాబు, గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.