Jul 02,2022 08:27

టెహరాన్‌ : దక్షిణ ఇరాన్‌లోని హోర్మూజ్గన్‌ ప్రావిన్స్‌లో శనివారం తెల్లవారు జామున భూమి మూడుసార్లు కంపించింది. రిచ్‌టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6 పాయింట్లుగా నమోదైంది. భూకంప ధాటికి ఐదుగురు మరణించగా, 49మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2గంటలకు భూమిలో 10కిలోమీటర్లు లోతున భూకంపం సంభవించింది. దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలో రెండుసార్లు ప్రకంపనలు సంభవించాయని, వాటి తీవ్రత 6.3గా నమోదైందని చెప్పారు. ఆ తర్వాత కూడా పలుసార్లు భూమి కంపిస్తూనే వుంది. అవన్నీ నాలుగుకు పైగా తీవ్రతను నమోదు చేశాయని అధికారులు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు, వంతెనలు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడి రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.