Nov 21,2022 15:03

ప్రజాశక్తి - విజయవాడ : సూపర్‌ స్టార్‌ కృష్ణ అస్థికలను ఆయన తనయుడు మహేష్‌ బాబు కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్‌ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మహేష్‌ అక్కడినుండి రోడ్డుమార్గంలో కృష్ణా తీరానికి బయలుదేరారు. కృష్ణానది ఉండవల్లి కరకట్ట మీద ఉన్న ధర్మనిలయం వద్ద అస్థికలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ సోదరుడు శేషగిరిరావు, అల్లుళ్లు గల్లా జయదేవ్‌, సుధీర్‌ బాబుతో పాటు ఇతర కుటుంబసభ్యులు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ పాల్గొన్నారు.