
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న 'ఎస్‌ఎస్‌ఎంబీ28' చిత్ర టైటిల్ బుధవారం ప్రకటించారు. కృష్ణ జయంతి సందర్భంగా ఆయన హిట్ చిత్రాల్లో ఒకటైన 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 4కె వెర్షన్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాస్ స్ట్రైక్ పేరుతో అభిమానులే ఈ చిత్ర టైటిల్‌ను విడుదల చేశారు. 'గుంటూరు కారం' టైటిల్‌ను ఖరారు చేశారు. మహేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీలా నాయికలు. 'అతడు', 'ఖలేజా' సినిమా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఈ చిత్రం రాబోతోంది.