Aug 09,2022 15:59

ఇంటర్నెట్‌డెస్క్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు పుట్టినరోజు (ఆగస్టు 9) సందర్భంగా.. పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

  • ఎందరో చిన్నారులకు గుండె చికిత్స చేయించిన సహృదయం పేరు మహేష్‌బాబు. భగవంతుడు అతనికి మరింత శక్తిని, విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా - చిరంజీవి
  • మహేష్‌బాబు తనదైన శైలి నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు.. హృద్రోగంతో బాధపడే చిన్నారులకి శస్త్ర చికిత్సలు చేయించడం అభినందనీయం. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. తండ్రి బాటలోనే దర్శకులు, నిర్మాతలకు అండగా నిలుస్తున్నారు. మున్ముందు మహేష్‌గారు మరిన్ని విజయాలు సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా' - పవన్‌కల్యాణ్‌
  •  హ్యాపీ బర్త్‌డే మహేశ్‌ అన్నా.. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని, విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా - ఎన్టీఆర్‌.
  • హ్యాపీ బర్త్‌డే మహేశ్‌. మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. - రామ్‌చరణ్‌
  • హ్యాపీ బర్త్‌డే మహేశ్‌బాబు. మీరు ఆనందంగా ఉండాలని, మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా. - మమ్ముట్టి.
  • చిన్నోడా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే - వెంకటేశ్‌
  • ఎంతోమంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మహారాజు మహేశ్‌బాబుకి జన్మదిన శుభాకాంక్షలు - రోజా
  • మేజర్‌ సినిమా ద్వారా మీ ప్రేమ, మద్దతు పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు మాకు స్ఫూర్తి.  హ్యాపీ బర్త్‌డే మహేష్‌ సార్‌. - అడవిశేష్‌
  • మహేశ్‌.. నీదైన చరిష్మా, స్టైల్‌తో అలరిస్తుంటావ్‌. నీ ప్రయాణాన్ని ఇలానే కొనసాగిస్తూ.. స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా. నువ్వు నటించిన 'పోకిరి' చిత్రం 16 ఏళైనా ఇప్పటికీ ఫ్రెష్‌గా ఉంది. నువ్వు నటించిన ఈ సినిమాకు నేను నిర్మాతగా వ్యవహరించినందుకు గర్వపడుతున్నా - మంజుల (మహేష్‌ సోదరి)
  • పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్‌ మహేశ్‌. నువ్వెప్పుడూ దూసుకెళ్తూనే ఉండాలి - మంచువిష్ణు.
  • సూపర్‌ హ్యాండ్‌సమ్‌ స్టార్‌ మహేష్‌బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీ తదుపరి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా - రామ్‌పోతినేని.

వీరితోపాటు, దర్శకులు గుణశేఖర్‌, కోన వెంకట్‌, సంపత్‌ నంది, వంశీ పైడిపల్లి, శ్రీనువైట్ల, అనీల్‌ రావిపూడి ట్విటర్‌ వేదికగా.. బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా.. మహేష్‌బాబు ఆయా దర్శకులతో దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. హీరో సుధీర్‌ బాబు కూడా మహేష్‌బాబు కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.